...

3500* వ రోజు ...

     వేకువనే 4:17 నిలకు 216 జాతీయ రహదారిలో కొత్తూరు జంక్షన్ దాటిన తరువాత బస్స్టాప్ వద్ద 17 మందితో స్వచ్ఛ సేవలు మొదలై రోడ్డుకు క్రింది భాగంలో ఉన్న తుక్కు, ప్లాస్టిక్ వ్యర్ధాలను పైకి చేరవేసి లోడింగ్ కి అనుకూలంగా గుట్టలుగా చేర్చడం జరిగింది. మరికొంత మంది వంతెన సమీపం వరకు గడ్డిని తొలగించి శుభ్రం చేశారు.          ఈ...

READMORE
...

3499* వ రోజు ...

   తెల్లవారు జామున 4:14 ని.లకు హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్స్టాప్ వద్ద 14 మందితో స్వచ్చంద యజ్ఞం ప్రారంభమయింది. రోడ్డుకు అంచున ఉన్న సువర్ణ గన్నేరు మొక్కల చుట్టూ మరియు రోడ్డుకు దిగువ భాగాన ఉన్న నీడనిచ్చే మొక్కల చుట్టూ పిచ్చి గడ్డి తొలగించడం, అలాగే ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేయడం, దంతులతో పిచ్చి గడ్డిని పైకి లాగి ప్రోగు పెట్టడం జరిగింది. మహిళా కార్యకర్తలు చీపుళ్ళతో ఎప్పటికప్పడు జరిగిన పని వెనుక శుభ్రం చేయడంతో ఆ ప్రాంతం ఎంతో చూడచక్కగా ఉంది. ...

READMORE
...

3498* వ రోజు ...

    వేకువ జాము 4:15 ని. హైవే రోడ్ లోని బస్టాప్ వద్ద 10 మంది కార్యకర్తలతో పని మొదలై ఎంతో ఉత్సాహవంతంగా జరిగింది. రోడ్డు దిగువ భాగాన నీడనిచ్చే చెట్లు నాటడానికి ముందుగా సిద్దం చేసుకున్న గోతులలో తురాయి, స్పితోడియా, నేరేడు మొత్తం  కలిపి 70 మొక్కలను ఇద్దరు ఇద్దరు కార్యకర్తలు కలిసి బృందాలుగా ఏర్పడి మొక్కలను జాగ్రత్తగా నాటడం జరిగింది. ...

READMORE
...

3497* వ రోజు ... ...

    12.06.2025 గురువారం తెల్లవారు జాము 4:14 ని. హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ వద్ద 11 మందితో ప్రారంభమయిన స్వచ్చంద సేవలు హైవే రోడ్డుకు ఒక ప్రక్కన చక్కగా పెరిగిన పారిజాతం మొక్కల చుట్టూ కలుపు తీయడం జరిగింది. మరికొంతమంది ఈ మొక్కల దిగువన శుభ్రపరచడం, నీడ...

READMORE
...

3496* వ రోజు ... ...

       వేకువ ఝామున 4:13 ని.లకు 10 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ ముగింపు సమయానికి 25 మందితో కళకళలాడింది. ప్రత్యేక దళ సభ్యులు 6 గురు కాసానగర్ చెక్ పోస్ట్ దగ్గరలో హైవేకు దిగువన గతంలో నాటిన నీడనిచ్చే మొక్కల వరుసలో మరిన్ని మొక్కలు నాటుటకు అనువుగా గుంటలు తీయటం కన్పించింది. ముగింపు సమయానికి 12 మొక్కలు పెట్టుటకు గాను గోతులు తీశారు. రేపు మరిన్ని మొక్కలు నాటుటకు ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేస్తారు. ...

READMORE
...

3495* వ రోజు ... ...

    తెల్లవారు ఝామున 4:16 ని॥లకు వేకువ సేవ 10 మందితో ప్రారంభమయింది. హైవే లో శివరామపురం దగ్గరగా రహదారికి దిగువున ఎడమ ప్రక్కగా కలుపు మొక్కలను పీకుతూ, మొక్కల మొదళ్ళలోని చెత్తను వేరుచేస్తూ, మొక్కలకు పాదులు చేస్తూ ప్రత్యేక దళ సభ్యులు 6 గురు శ్రమిస్తుండగా వారికి సహాయంగా గొర్రులతో చెత్తను పోగు పెడుతూ కొందరు, డిప్పలకెత్తి ట్రాక్టర్ లో చెత్తను లోడ్ చేస్తూ మరికొందరు ఇష్టంగా కష్టపడడం కనిపించింది. ...

READMORE
...

3494* వ రోజు ... ...

   వేకువ జాము 4:16 ని॥లకు హైవే రోడ్ లోని కొత్తూరు రోడ్ జంక్షన్ కు అతి సమీపంలో 13 మందితో ప్రారంభమయిన శ్రమయజ్ఞం నిర్విరామంగా కొనసాగింది. మొక్కలకు దిగువ భాగంలో అనగా నీడనిచ్చు మొక్కలకు చుట్టూ ఉన్న మాచర్ల కంప, పిచ్చి దొండ తీగలను తొలగించి మొక్కలకు గాలి తగిలి స్వేచ్చగా పెరగడానికి వీలుగా చేయడం జరిగింది. ...

READMORE
[1] 2 3 4 5 ... > >>