3653* వ రోజు . ...
ATM సెంటరు వద్ద వేకువ జాము 4.15 ని. లకు కార్యకర్తలు అంతా చేరి పనికి సిద్ధమయ్యేసరికి ఆ ప్రాంగణమంతా మట్టితో నిండి ఉంది. చల్లపల్లిలో ఏదైనా ఓపెన్ మీటింగ్ జరుపుకోవాలంటే, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ కూర్చోటానికి వీలుగా ఆ సెంటర్ లో ప్రాంగణమంతా పేవర్ టైల్స్ తో సౌకర్యంగా ఉండేది. స్వచ్చ కార్యకర్తలు అంత వీలుగా ఆ ప్రదేశాన్ని ఒకప్పుడు తీర్చిదిద్దారు.
...
READMORE
3652* వ రోజు . ...
ఈరోజు తెల్లవారుజాము 4:17 నిమిషాలకు కార్యకర్తలు సంత బజారు మొదట్లో కలుసుకుని పనికి ఉపక్రమించారు.
బందర్ రోడ్ లో చేయవలసిన పని తారు రోడ్డు శుభ్రం చేయడం. అంటే అది అంత తేలికైన పని అనుకుంటున్నారేమో అంగుళం మందాన రహదారి రెండు వైపులా మూడు మీటర్ల చొప్పున రోడ్డు ఇసుకతో పూడుకుపోయి, తారు రోడ్డు కొద్దిగా మాత్రమే మధ్యలో కనబడు...
READMORE
3651* వ రోజు . ...
సేవాకాలం నికరంగా 4.18 - 6.28, కొసరుగా పంచాయితీ వారి మరో 15 నిముషాలు. 45 గురు స్వచ్ఛ కార్యకర్తలూ, చివరలో 10 మంది పంచాయతి శ్రామికులు ఏమి సాధించారు అంటే –
అది పోలీసు ఠాణా వీధి - నాలుగో ఐదో బ్యాంకులు, ఆస్పత్రులు, ఆఫీసులు, టిఫిన్ సెంటర్లు, ...
READMORE
3650* వ రోజు ....
అనగా బుధవారం (12-11-25) బ్రహ్మకాలం - నాలుగ్గంటల పదమూడు నిముషాల నుండి 6.13 దాక 40+ మంది నెరవేర్చుకొన్న వీధి పారిశుద్ధ్య పనులు!
11 ఏళ్లనాడు అర్థ శతదిన శ్రమదానం పూర్తయితేనే గ్రామస్తులు, పాత్రికేయులు, పరిశీలకులు వింతగా - గొప్పగా భావించే వారు! మరి ఇ...
READMORE
3649* వ రోజు ...
మంగళవారం (11-11-25) నాటి ఆ వీధి పారిశుద్ధ్య శ్రమ వేకువ 4.15 కి 11 మందితోనే మొదలయ్యెను గాని, 4:30 తరువాత ఆ సంఖ్య గబగబా పెరిగి 38 కి చేరింది.
నేటి ...
READMORE
3648* వ రోజు ...
నిన్నటి వార్షికోత్సవ సంబరంతో కలిగిన ఎడబాటుకు ముగింపుగా ఈ సోమవారం వేకువ 4.30 కు కాదు - 4.12 కే తొందరపడిన 12 స్వచ్చ కోయిలలు ముందే శ్రమదానానికి దిగాయి!
వాటిల్లో ఒక కోయిలది ప్రస్తుత నివాసం విజయవాడ - ఉద్యోగం ఈనాడు పత్రిక. నిముష క్రమేణా ఈ ఊరి, ప్రక్క ఊళ్ల శ్రామిక కోకిలలూ ...
READMORE
3647* వ రోజు...
3647* వ నాటి వార్షికోత్సవ వార్తా విశేషాలు !
ఈ ఆదివారం జరిగినవి దైహిక శ్రమలు కావు ఇంకో సంవత్సరానికి సరిపడా ఆనందానుభూతులు!
కార్యకర్తలంతా వేకువ 4.30 కే ఊరికి దూరంగ...
READMORE