2003*వ రోజు...
ఈ నాటి వేకువ 4.00 - 6.05 సమయాల మధ్య యధావిదిగా – నిరాటంకంగా జరిగిన గ్రామ బాధ్యతా నిర్వహణంలో భాగస్వాములు 29 మంది. శ్రమాదాన లబ్ది చల్లపల్లిలోని రెండు – మూడు ప్రాంతాలకు - గంగులవారిపాలెం బాటలో, బందరు రహదారిలో, మొక్కలకు నీరందవలసిన మరికొన్ని వీధులలో!
...
READMORE
2002*వ రోజు...
ఈ నాటి వేకువ సమయంలో 4.10 నిముషాల నుండి 6.10 దాక వర్ధిల్లిన స్వచ్చ కార్యకర్తల శ్రమదాన సందేశంలో 29 మంది పాల్గొన్నారు. ప్రదేశం – ఎంత చేస్తున్నా తరగని చెత్తా – చెదారం నిండిన గంగులవారిపాలెం మార్గంతో పాటు...
READMORE
2001*వ రోజు...
మబ్బు పట్టిన ఈ నాటి వేకువ 4.00 - 6.00 నడుమ యధా ప్రకారం జరిగిన స్వచ్చంద శ్రమదానం లో పాల్గొన్న వారు 30 మంది. వారి నియమబద్ధ శ్రమదాన స్వేదంతో తడిసి, స్వస్త - సుందర - పునీతమైన ప్రాంతం 22 వ వార్డులోని చివరి భాగమైన గంగులవారిపాలెం దారిలోని ఊర మురుగు - బండ్రేవు కోడు మురుగు కాల్వల సంగమ ప్రదేశం.
...
READMORE
2000*వ రోజు...
దేశంలో – బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగని అసాధారణ – సుదీర్ఘ చల్లపల్లి స్వచ్చోద్యమం లో అరుదైన – 2000* నాటి వేకువ 4.00 కే గంగులవారిపాలెం దారిలోని బండ్రేవుకోడు మలుపు దగ్గరకు చేరుకొన్న 57 మంది కార్యకర్తల విజయ గర్వదాయకమైన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం ఈరోజు ముందుగానే – 5.30 కే ముగిసింది.
...
READMORE
1991*వ రోజు...
యధాతధంగా – పట్టు సడలని, చెక్కు చెదరని 35 మంది గ్రామ కర్తవ్య పరాయణుల సొంత ఊరి స్వస్తతా మెరుగుదల ప్రయత్నాలు నేటి వేకువ కూడ విజయవంతంగా నెరవేరి, సుందరీకరణ యజ్ఞం మినహా - బందరు మార్గంలోని అమరావతి రాజ ప్రాసాదం దగ్గరి వైజయంతం ఆవరణ అనుకొన్న కంటే మిన్నగా – కార్యకర్తల...
READMORE
1990*వ రోజు...
2000 చారిత్రాత్మక దినాలకు 10 అడుగుల దూరంలో నిలిచిన ఈ నాటి స్వచ్చోద్యమ సంరంభం వేకువ 4.00 – 6.30 నడుమ రెండు వీధుల్లో – 3 విధాలుగా నడిచింది. (6.30 కు నేనింటికి వచ్చే సమయానికి ఏడుగురు ఇంకా తమ పనిలో మునిగే ఉన్నారు.) 36 మందిలో కొందరు బందరు రహదారి ప్రక్కన వైజయంతం దగ్గర, కొందరు ఆవరణ లోపల, నలుగురైదుగురు గంగులవారిపాలెం బాటలోను పనిచేశారు.
...
READMORE
1989*వ రోజు...
ఐదారేళ్లుగా ఏ ఒక్క నాడూ తమ గ్రామ బాధ్యతలు విస్మరించని స్వచ్చ సైనికులు నేటి వేకువ కూడ 3.59 – 6.10 వేళల మధ్య త్రిముఖంగా – రెండు ప్రాంతాలలో తమ కర్తవ్య నిర్వహణకు పూనుకొన్నారు. వీళ్ళు సంఖ్యలో 33 మందే గాని, శ్రమదానం లో పూర్తి ఆనందం పొందుతూ – ఉద్వేగం చెందుతూ – నిర్దేసించుకొన్న లక్ష్య సాధనలో అవలీల గా కొన్ని అద్భుతాలు చేస్తుంటారు! ఎవ్వరూ వీళ్ళని ప్రేరేపించల...
READMORE