...

2555* వ రోజు...

 ఈ శుక్రవారం వేకువ సమయాన తమ వంతు సామాజిక శ్రమను వేడుకగా మార్చిన వ్యక్తులు 23 మంది. (వీరిలో కొందరికైతే 4.16 కే పనివేళ!) వాన తెరపి ఇచ్చింది గాని – వాట్సప్ మాధ్యమంలో చూపినట్లు - రోడ్ల ప్రక్కన నీటి చెలమలే! ట్రిమ్ చేసి సుందరీకరించ వలసిన చెట్లన్నీ తడిసి ముద్దలే! అలాంటి అననుకూల పరిస్థితుల్లోనే మన జగమొండి కార్యకర్తల వీధి బాధ్యతలు! (ఏం...

READMORE
...

2554* వ రోజు.....

   గురువారం (6.10.22) వేకువ సైతం 4.19 కే – బైపాస్ వీధి వద్దే మొదలైన 22 మంది పారిశుద్ధ్య కృషి కనీసం మూడు చోట్ల విజయవంతమైంది! సగం వరకూ అది సాఫీగానే సాగింది గానీ, ఇక ఉండబట్టలేక – స్వచ్చంద వేడుక పట్ల అభిమానం ఆపుకోలేక - వరుణ వీరుడు ప్రత్యక్షమయ్యాడు! అక్కడికీ – పావుగంట సేపు – 6.00 దాక కార్యకర్తలు పాక్షికంగా తడుస్తూనే - టోపీలు లేనివాళ్లు తలలు తడుపుకొంటానే – తమ కృషి కొనసాగించారు గాని - తయారైన వ్యర్ధాల తరలింపుకు సమయం చాలినట్లు లేదు! ...

READMORE
...

2553* వ రోజు...

     బుధవారం - విజయదశమి (5-10.22) వేకువ సమయపు సదరు సంకేతాలు 2 గంటలకు పైగానే - అనగా 4.22 నుండి 6.25 దాక అందుతూనే ఉన్నాయి – అందుకోగలిగిన వాళ్లకు! శ్రామికులు 23 మందైతే - శ్రమదాన కేంద్రాలు బెజవ...

READMORE
...

2552* వ రోజు...

  ఈ మంగళవారం (4.10.22) నాటి వీధి పారిశుద్ధ్య ప్రవీణులు 6 ½ మంది! (అంటే.. ఒకాయన మధ్యలో ఇంటికెళ్ళిపోయాడు గనుక) వాళ్ళకు వత్తాసుగా నాబోటి గాళ్లు మరో ముగ్గురు! వాళ్ల నిబద్ధత 4.30 కే మొదలై - 6.10 దాక నిలిచింది!           ఆ శ్రమ...

READMORE
...

2551* వ రోజు...

     4.25 కే సోమవారం (3-10-22) తమ డ్యూటీలో దిగిన రెస్క్యూ దళం 6.20 కి ఈ నాడు తలపెట్టిన పని పూర్తిచేశారు. పనిచోటు బెజవాడ బాటలోని NTR పార్కు సమీపాన:           వాళ్ల ఉద్దేశం రోడ్ల భద్రతకు సంబంధించినది. రెండు నెలల క్రితం ఒక విశ్రాంత వ్యాయామోపాధ్యాయుల వారి 2 లక్షల ఔదార్యంతో ఈ ఊ...

READMORE
<< < ... 260 261 262 263 [264] 265 266 267 268 ... > >>