ఇంకా మారవలసిన కొంతమంది....           (25-Jun-2020)


చల్లపల్లి ప్రధాన రహదారిలో ప్రతిరోజూ రెండు సార్లు ట్రాక్టర్ తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకి తరలించటం జరుగుతోంది. దయచేసి ఎవ్వరూ రోడ్డు మీద చెత్త వెయ్యవొద్దని, ఒక బుట్టలో పెట్టి చెత్త బండికి ఇవ్వవలసినదిగా వ్యాపారస్తులకు, ఇళ్లవారికి మన కార్యకర్తలూ అనేకసార్లు చెప్పారు, ట్రాక్టర్ మైక్ లో కూడా ప్రతిరోజూ చెప్పడం జరుగుతోంది. చాలామంది ఇవన్నీ పాటిస్తున్నా కొన్ని దుకాణాల వారు ట్రాక్టర్ వెళ్ళిన తరువాత ఊడ్చి రోడ్డు మీద వెయ్యడం జరుగుతోంది. అలాగే పై అంతస్తులలో ఉన్న కొన్ని కుటుంబాల వారు చెత్తను ఒక క్యారీ బ్యాగులో కట్టి కింద పడవెయ్యటం జరుగుతోంది. ఉదయాన్నే వీటి వలన రోడ్లన్నీ అశుభ్రంగా ఉంటున్నాయి. కొద్దిమందిలో ఉన్న ఈ అలవాటును మార్చటానికి మనందరం మరింత సహనంగా కౌన్సిలింగ్ చేయవలసి ఉంటుంది.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
ది. 06-03-2017