అన్న సమారాధన చేయాలా?….. చేస్తే ఎలా చేయాలి?....           (25-Jun-2020)


అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నిన్న ATM సెంటర్ లో అన్న సమారాధన జరిగింది. దీనికి దాదాపు 7,000 మంది భోజనం చేసినట్లుగా చెప్తున్నారు. విస్తరాకులు, ప్లాస్టిక్ గ్లాసులు, వదిలేసిన ఆహార పదార్ధాలు ఆ ప్రాంతమంతా పడేసి ఉన్నాయి. 40 మంది పాల్గొన్న నేటి స్వచ్ఛ కార్యక్రమంలో ATM సెంటర్ ని శుభ్రం చెయ్యటానికే సమయం అంతా పట్టింది.

 

కార్యకర్తలలో కొంతమంది వ్యక్తపరిచిన అభిప్రాయాలు:

 

1. భక్తిపూర్వకమైన కార్యక్రమాలలో అవకాశమున్నచో అన్న సమారాధనని చెయ్యటం మానేసి ఆ ధనాన్ని మరొక రకమైన ప్రయోజనకరమైన కార్యక్రమానికి ఉపయోగిస్తే బాగుంటుంది.

 

2. ధ్వజస్థంభ ప్రతిష్ట చేసే సమయాలలో అనేక గ్రామాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారందరికీ ఆ సమయంలో భోజన ఏర్పాట్లను చేయక తప్పదు. అలాంటి సమయాలలో….

 

A. రోడ్డుపక్కల కాకుండా కళ్యాణమండపాలు, ఫంక్షన్ హాల్స్ లో కానీ, ఖాళీ స్థలాలలో కానీ చేస్తే బాగుంటుంది.

 

B. కార్యక్రమంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న విస్తరాకులు వాడుతున్నారు. ఈ రెండింటినీ వాడకుండా ఉండాలి.

 

C. కార్యక్రమం అవ్వగానే భోజనాలు జరిగిన భాగమంతా శుభ్రం చేయించే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాలి.

 

అన్న సమారాధన సమయంలో మన ఊరు మరింత పరిశుభ్రంగా ఉంచటానికి ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
02-07-2018