మార్చుకోవలసిన మన సంస్కృతి....           (23-Jun-2020)


ఇంట్లో చెత్తను తీసుకువెళ్ళి రోడ్డుపక్కల, డ్రెయిన్లలోను, పంటకాల్వలలోను పడవెయ్యడం ఇప్పటిదాకా ఉన్న మన సంస్కృతి. ఇళ్ళలోను, ఆఫీస్ లలోను చక్కగా మొక్కలు పెట్టుకుని పెంచుకుంటూ వాటి కొమ్మలను కత్తిరించి రోడ్డు మీద పడవెయ్యడం కూడా మనకు ఇప్పటి వరకూ ఉన్న అలవాటే. రోడ్డుపక్కన పెంచిన మొక్కలు పెద్దవయిన తరువాత కరెంటు తీగలలోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకని ఎలక్ట్రికల్ డిపార్టుమెంటు వారు ఎప్పటికప్పుడు కొమ్మలను క్రిందికి నరుకుతూ ఉంటారు. ఈ కత్తిరించిన కొమ్మలు రోడ్డుపక్కనే పడి ఉంటాయి. వీటిని ఎవరు తీయాలో మార్గదర్శకాలు ఉండవు. పంచాయతీ వారు గాని, మున్సిపాలిటీ వారు గాని తీస్తే తీయవచ్చు. లేదా అలాగే ఉండి ఎండిపోతాయి.

 

ఈ పద్ధతులను మార్చుకోవలసిందే. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు గాని, ప్రభుత్వ సంస్థలు గాని ఇలా మొక్కల కొమ్మలను నరికేటప్పుడు వాటిని తీసుకుని వెళ్లి డంపింగ్ యార్డుకి చేర్చే బాధ్యతను కూడా వారే తీసుకోవాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
20-07-2018