తరిగోపుల కోటేశ్వర రావు గారి సంస్మరణ కార్యక్రమం....           (23-Jun-2020)


నిన్న ఒంగోలులో జరిగిన తరిగోపుల కోటేశ్వర రావు గారి సంస్మరణ కార్యక్రమం గురించి…..

 

స్వచ్ఛ కార్యకర్త డా. పద్మావతి గారి తండ్రి గారైన తరిగోపుల కోటేశ్వర రావు గారి సంస్మరణ కార్యక్రమం నిన్న ఒంగోలులో జరిగింది. ఎంతో శ్రమకోర్చి మన స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరైనారు. కోటేశ్వర రావు గారి గురించి తాను రాసిన పద్యాలను రామారావు మాస్టారు చదివి వారి కుమారుడు డా. పురుషోత్తమ రావు గారికి అందచేశారు. మొక్కల రమణ గారు తీసుకు వచ్చిన నేరేడు, బత్తాయి మొక్కలను కోటేశ్వర రావు గారి స్మృతికి బహూకరించారు. కోటేశ్వర రావు గారి ఫోటో వద్దవారి కుమారుడు డా. పురుషోత్తం గారు, కోడలు డా. ఉదయని గారితో కలిసి అందరూ గ్రూప్ ఫోటో దిగారు.

 

ఇటువంటి కార్యక్రమాలలో జరిగే భోజనాల వద్ద పర్యావరణహితంగా ఏమేమి చెయ్యవచ్చో స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం తరఫున డా. పురుషోత్తం గారికి ముందే వివరించటం జరిగింది. దానికనుగుణంగా వారు –

 

1. ఫ్లెక్సీ పెట్టలేదు.

 

2. భోజనాల బల్లపై మామూలు కాగితమే వేశారు.

 

3. పంక్తి భోజనాలలో అరిటాకులలో వడ్డించారు.

 

4. బఫేలో మళ్ళీ మళ్ళీ వాడగలిగే ప్లాస్టిక్ ప్లేట్లపై అరిటాకు వేసి అందజేశారు.

 

ఇది స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ ఫలితమే!

 

మంచినీళ్ళు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లో ఇచ్చారు. మనం ప్రతిపాదించిన వాటిలో జరగనిది ఇదొక్కటే. మార్పు మొత్తం ఒక్కసారే రాకపోవచ్చు.

 

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. నిన్నటి కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదములు.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
23-07-2018