వైద్యరంగంలో WORLD RECORDS నైతికమేనా?....           (22-Jun-2020)


వైద్యరంగంలో WORLD RECORDS నైతికమేనా?

 

ఒక దినపత్రికలో ప్రచురింపబడిన ‘గుంటూరు ఆర్థోపెడిక్ వైద్యుడి వరల్డ్ రికార్డు’ వార్త చదివిన తరువాత నా స్పందన ఇది.

 

ఈ ఉత్తరాన్ని ఆ దినపత్రిక ప్రచురించలేదు. 

 

ఈ WORLD RECORDS నైతికమేనా?

ఒక డాక్టర్ ఒకే రోజు ఎక్కువ ఆపరేషన్లు చెయ్యటం ద్వారా రికార్డు సృష్టించటం అనేది అవసరమా? నైతికమేనా?

 

ఒకేరోజు ఎక్కువ ఆపరేషన్స్ చెయ్యటం ద్వారా జనానికి జరిగే ఉపయోగం ఏమిటి?

 

ఇది చూసి మరొక వైద్యుడు ఒకేరోజు మరిన్ని ఆపరేషన్స్ చేసి మరో వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించవచ్చు. ఈ పోటీ వలన రోగులకు జరిగే మంచి ఏమీ లేకపోగా ఇటువంటి ప్రచారాలు సమాజానికి తప్పుడు సంకేతం ఇవ్వడం కాదా?

 

ఏ ఆపరేషన్ అయినా “ఆపరేషన్ చెయ్యవలసినవారి ఎంపిక, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్ చేసే బృందం యొక్క నైపుణ్యత, POST OPERATIVE MANAGEMENT, ఆ తరువాత అవసరమైనవారికి ఫిజియోథెరఫీ” – వీటన్నిటిలో నాణ్యత ఉంటేనే ఆపరేషన్ విజయవంతం అవుతుంది. అంతేగానీ రోజుకి ఎన్ని ఆపరేషన్లు చెయ్యటం అనేది వైద్య ప్రపంచంలో ఒక విషయమే కాదు. గతంలో కూడా ఇలా డాక్టర్లు ఒకేరోజు ఎక్కువ ఆపరేషన్లు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు లాంటివి తెచ్చుకోవడం, వాటిని ప్రచారం చేసుకోవడం లాంటివి కూడా జరిగాయి.

ప్రసార మాధ్యమాలు కూడా ఇటువంటి వార్తలను ప్రచురించటం మంచిది కాదు.

 

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

  చల్లపల్లి