వైద్యవృత్తిలో కొన్ని సమస్యలు....           (22-Jun-2020)


వైద్యవృత్తిలో కొన్ని సమస్యలు

 

డాక్టర్ల వైపు నుండి:

 

1. The lost art of Healing – రోగి చెప్పేవి వినడం మర్చిపోయాం. వినడంలో చాలాసార్లు రోగ నిర్ణయం జరుగుతుంది. రోగికి కూడా సంతృప్తిగా ఉంటుంది. వినే డాక్టర్ దగ్గరకే మళ్ళీమళ్ళీ వెళ్లాలని ఉంటుంది.

 

2. Complete clinical examination చేసేవాళ్ళు తగ్గిపోయారు. అనేక రకాలైన పరీక్షలు (రక్త పరీక్షలు, స్కానింగ్ లు వగైరాలు) అందుబాటు లోకి వచ్చిన తరువాత రోగిని మొత్తం వివరంగా పరీక్ష చెయ్యటం తగ్గిపోయింది. దీని వలన రోగ నిర్ణయం తప్పుగా జరిగే అవకాశం ఉంది.

 

3. Diagnosis చేసిన తరువాత జబ్బు గురించి, చికిత్స గురించి, prognosis గురించి తగిన సమయం తీసుకుని రోగికి counselling చెయ్యకపోవడం.

 

4. రోగి మందులు కొనుక్కున్న తరువాత అవి ఎలా వేసుకోవాలో వారికి అర్థమయ్యేంత వరకు చెప్పి పంపించే వ్యవస్థ లేకపోవడం.

 

రోగుల వైపు నుండి సమస్యలు:


1. డాక్టర్ పరీక్ష చేసేంత వరకు నిరీక్షించే ఓపిక లేకపోవడం. (Waiting period లో చాలా అసహనంగా ఉండటం)

 

2. గతంలో వాడిన రిపోర్టులు, డాక్టర్ల కాగితాలు, ఇప్పుడు వాడుతున్న మందులు తీసుకు రాకపోవడం.

 

3. ప్రతి జబ్బుకి వైద్యం ఉందని, మందుల వల్ల తగ్గుతుందని నమ్మడం.

 

4. ప్రతి జబ్బూ డాక్టర్ కి అర్థం అవుతుందని, వెంటనే తగ్గించకపోతే డాక్టర్ దే తప్పని భావించడం. రోగికి ప్రమాదం జరిగితే అది డాక్టర్ల నిర్లక్షం వల్లనే జరిగిందని అనుకోవడం.

 

5. 24 గంటలూ, 365 రోజులూ డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆశించడం.

 

6. రోగి, అతనితో బాటు వచ్చిన బంధువులు డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్ ఆపకుండా ఉండటం.

 

7. ఒక రోగి గురించి అనేకమంది అనేకసార్లు మాట్లాడడం.

 

8. ఫోన్లలో వైద్యాన్ని అడగటం.

 

9. బజార్లో గాని, వేడుకలలో గాని కలిసినప్పుడు తమ బాధలను చెప్పుకోవడం.

 

10. సహాయకులు లేకుండా ఒక్కరే చూపించుకోవడానికి హాస్పిటల్ కి రావడం.

 

11. ఏ బాధ వచ్చినా family doctor వద్దకు కానీ, General Practitioner (ఒళ్లంతా చూసే డాక్టర్) వద్దకు కానీ వెళ్ళకుండా సరాసరి specialist doctor (ఒంట్లో ఒక భాగాన్ని మాత్రమే చూసే డాక్టర్) వద్దకు వెళ్ళడం –

ఇలా వెళ్ళడం మూలంగా అనవసరమైన ఖర్చే కాకుండా జబ్బు నిర్ణయం కూడా తప్పు జరగవచ్చు.
ఉదా:- ఛాతీలో నొప్పి అని ఒక రోగి సరాసరి గుండె డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాడు. ECG, గుండె స్కానింగ్ చేసి ‘గుండె బాగున్నది, ప్రమాదం లేదు’ అని చెప్పారు. కానీ ఆ నొప్పి ఎన్ని రోజులకీ తగ్గకపోతుంటే General Practitioner దగ్గరకు వెళ్తే అది ఊపిరితిత్తుల కాన్సర్ అని తేలింది. ఇతను ముందే General Practitioner (M.B.B.S. Doctor or M.D. Doctor) దగ్గరకి వెళ్లి ఉంటే ఇంకా ముందే రోగ నిర్ణయం జరిగి ఉండేది.

 

12. Specialist doctor దగ్గరకి పంపితే ఒకళ్ళ దగ్గరకి వెళ్తామని చెప్పి ఉత్తరం రాయించుకుని, దారిలో మనసు మార్చుకుని వేరొకరి దగ్గరకు వెళ్ళడం.

 

13. ఒక ఆపరేషన్ కి గాని, కాన్పుకి గాని, ఏదైనా పరీక్షలకు గాని ఎంత ఖర్చవుతుందో ముందుగానే ఆసుపత్రి వర్గాలతో counseling తీసుకోవాలి. ‘డబ్బు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, మంచి వైద్యం చెయ్యండి’ అని వైద్యం చేయించుకుని కొంతమంది వెళ్ళేరోజు తమ పలుకుబడిని ఉపయోగించి బిల్లు తగ్గించమని తెలిసిన వాళ్ళతో ఫోన్లు చేయిస్తుంటారు. మొదట మాట్లాడినవారు ఆరోజు కనిపించరు.

 

14. రోగికి ప్రాణ ప్రమాదం జరిగినప్పుడు డాక్టర్ల పైన, ఆసుపత్రుల పైన జరిగే దాడులు.
రోగులందరినీ జబ్బుల నుండి డాక్టర్ కాపాడలేడు. అలా చేయగలిగే శక్తే డాక్టర్లకుంటే డాక్టర్లందరూ 100 ఏళ్ళూ బ్రతికేవాళ్ళే. కానీ డాక్టర్లు కూడా చనిపోతున్నారు కదా! రోగి జబ్బు వలన చనిపోయాడా? లేక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడా? అనేది పక్కన పెట్టి డాక్టర్ మీద దాడులు చెయ్యటం అనేది ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.

 

Family doctors నుండీ Specialist doctor లకు సమస్యలు:

 

1. కొన్నిసార్లు జబ్బు అర్థం కాకపోయినా, రోగి ప్రమాదకరంగా ఉన్నా Specialist doctor వద్దకు పంపించవలసి ఉంటుంది. పంపబోయే ముందు తన దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న రోగి పరిస్థితి, తాను చేసిన వైద్యం (ఇచ్చిన మందులు, ఇంజక్షన్లు), ఎందుకు పంపిస్తున్నామో తెలిపే వివరాలున్న కాగితం గానీ, ఒక ఉత్తరం గానీ ఇవ్వాలి. ఈ వివరాలు లేకపోతే Specialist doctor కి జబ్బుని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

 

Specialist doctors నుండి Family doctors కు సమస్యలు:

 

1. రోగి Specialist doctor వద్ద admit అయిన తరువాత రోగ నిర్ణయమేమిటో, ఎలా వైద్యం చేస్తున్నారో పంపిన family doctor కి తెలియాలి.

ఆ రోగి ఏ జబ్బుతో బాధపడుతున్నాడో తెలుసుకోవాలనే వైద్యపరమైన ఆసక్తితో పాటు, ప్రతిరోజూ రోగి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా అవసరం.

కనుక రోగి యొక్క పరిస్థితి Specialist doctor తనకు వీలున్న సమయంలో పంపిన ఫ్యామిలీ డాక్టర్ కి తెలియపరుస్తూ ఉండాలి. ఒకవేళ రోగి పరిస్థితి ప్రమాదంగా ఉంటే తప్పకుండా వెంటనే తెలియ చెయ్యాలి.

 

2. Family doctor రోగి పరిస్థితి తెలుసుకోవడానికి ఫోన్ చేసినప్పుడు Specialist doctor వెంటనే మాట్లాడగలిగిన పరిస్థితి ఉండక పోవచ్చు. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. వీలున్నప్పుడు తిరిగి ఫోన్ చేస్తే చాలు.

 

Multi speciality Hospitals నుండి రోగులకు సమస్యలు:

 

1. పెద్ద ఆసుపత్రులలో (Multi speciality hospitals) communication gaps ఎక్కువగా ఉంటాయి. ఆసుపత్రికి వెళ్ళిన తరువాత రోగికి, సహాయకులకు గందరగోళంగా ఉంటుంది. అందుకే ఒక రోగికి ఒక డాక్టర్ కానీ, ఆసుపత్రికి సంబంధించిన ఒక ఉద్యోగి కానీ బాధ్యులుగా ఉండాలి. ఆసుపత్రిలో చేరిన తరువాత ఎంతమంది డాక్టర్లు చూసినా బాధ్యుడుగా ఉన్న డాక్టర్ అందరికీ సమన్వయం కుదురుస్తూ, అన్నింటినీ రోగికి వివరిస్తూ ఉండాలి.

 

2. ముందుగా అనుకున్న దాని కంటే అనూహ్యంగా ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోవడం.

 

ప్రభుత్వం వైపు నుండి సమస్యలు:

 

1. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఒక డాక్టర్, ఇద్దరు డాక్టర్లు (ఉదా: భార్యా భర్తా) కలిసి నడిపే ఆసుపత్రులు తగ్గిపోతున్నాయి. చివరకు అన్నీ Multi speciality hospitals, Tertiary referral hospitals మాత్రమే మిగిలేట్లు ఉన్నాయి. దీనివలన Primary care Physicians లేకుండా పోయి రోగులకు, సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది.

 

 

-  డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
     09-02-2018