కౌన్సిలింగ్ అంటే........           (10-Feb-2020)


పై బిల్డింగ్ లోనే మేము చల్లపల్లి లో 1988 లో హాస్పిటల్ మొదలుపెట్టాము.

హాస్పిటల్ ముందు ఇప్పుడు సిమెంట్ రోడ్డు కనిపిస్తున్నా అప్పుడు పెద్ద పెద్ద గోతులతో ఘోరంగా ఉండేది.

 

            చిట్టి మావయ్య గారు ఒక రోజు మమ్మల్న్ని చూడడానికి వచ్చారు.

             ఈ రోడ్డు ఇలా ఉందేమిటి అని అడిగారు.

            అవును మావయ్య గారూ ఎవరూ పట్టించుకోవడం లేదు అన్నాను.

            నీ ఇంటి ముందు రోడ్డు నువ్వే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు?’ అన్నారు.  

            ఈ వాక్యం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది.  

            ఇప్పుడు నేను మా హాస్పిటల్ రోడ్ నే కాదు, ఊరంతా బాగుచేయాలని సంకల్పించడానికి నాకు ఆ రోజు మా చిట్టి మావయ్య గారు ఇచ్చిన కౌన్సిలింగ్ కూడా ఒక ముఖ్య కారణం. చిట్టి మావయ్య గారికి చల్లపల్లి ఋణపడి ఉంటుంది.

            మొన్న ఉదయం స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం ఆప్రాంతంలోనే జరిగింది. ఈ విషయాన్ని మా సహకార కార్యకర్తలందరికీ చెప్పడం జరిగింది.

                    

 బాబ్జీ,

చల్లపల్లి,

10.02.2020.