స. వెం. రమేశ్ - ఒక నిత్య సంచారి....           (06-Sep-2022)


స. వెం. రమేశ్

- ఒక నిత్య సంచారి

          మనందరం తప్పక తెలుసుకోవాల్సిన మనిషి.

          తమిళనాడులో పుట్టిన తెలుగు వ్యక్తి. దాదాపు 15 సంవత్సరాల వయస్సు వరకు తెలుగు పెద్దగా రాదు.

          తమిళనాడులో తెలుగు వారిని, తెలుగును అవమానించడం చూసి భరించలేక తెలుగు కోసం శాస్త్రీయంగా ఉద్యమిస్తున్న *పొరుగు తెలుగు వాడు’*.

          మన దేశంలోనూ, ప్రపంచంలోనూ తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని చెప్పడం, మరిచిపోయిన తెలుగు మాటలు గుర్తు చేయడం తన పనిగా పెట్టుకున్నాడు.   

          పాతిక పైగా సంవత్సరాల నాడు ప్రారంభమైన ఆతని ఈ ఉద్యమ ప్రస్థానం నేటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోంది.

          ఈ వీడియో ప్రశాంతంగా చూడండి.www.youtube.com/watch

          అందరూ చూడండి.

          ఆసక్తి గల వారికి మరికొన్ని వీడియోలు పంపుతాను.

          తెలుగు వారి కోసం అతను చేసే ఈ పరిశోధన మరెవ్వరూ చేయలేదు.

          తెలుగును బ్రతికించాలనే ఒకే ఒక్క కారణం కోసమే పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని గడుపుతున్న ధన్య జీవి స. వెం.రమేశ్.

- డా. దాసరి రామ కృష్ణ ప్రసాదు

 

   06.09.2022.