అమాయకులనేవాళ్ళు అసలు ఉంటారా?....           (09-Sep-2020)


 గుర్తుకొస్తున్నాయి ...38

కాలేజీ రోజులు

 

*"అమాయకులనేవాళ్ళు అసలు ఉంటారా?" *


46 సంవత్సరాల క్రితం. .

 

మెడిసిన్ ఫస్టియర్లో నేనూ ,రాజూ ,రవీ ,శివాజీ ,
సౌభాగ్యవాణీ ,పద్మావతీ స్నేహంగా ఉండేవాళ్ళం.

 

పద్మ చాలా మంచమ్మాయి .


మరీ అమాయకంగా ,మెత్తగా ఉండేది .

 

ఒకరోజు మేమంతా మా కాలేజీ కాంటీన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము .

 

పద్మ ఇంకా రాలేదు . మాటల్లో తన గురించి నా అభిప్రాయం చెప్పాను .

 

'పద్మ ఇంత అమాయకురాలు కదా ,ముందు ముందు ఎలా బతుకుతుందో ఏమో ' అన్నాను .

 

గల గలా నవ్వింది సౌభాగ్యవాణి . అందరం ఆశ్చర్యంగా ఆవిడనే చూస్తున్నాం. ఎంతసేపటికీ నవ్వు ఆపదే ! లొట్టుపిట్టలు ,లొట్టుపిట్టలు అంటూ సావిత్రి నవ్వుతుందే అలా అన్నమాట .

 

ఆఖరికి తన నవ్వుకు కారణం ఇలా చెప్పింది .

 

'రెండ్రోజులక్రితం పద్మ ఏమందో తెలుసా ?'

 

'ఏమంది ?' కుతూహలంగా అడిగాం.

 

'డి ఆర్ కె ఇంత అమాయకుడు గదా ,ముందు ముందు ఎలా బ్రతుకుతాడో !


అని నిట్టూర్చింది 'అంటూ మళ్ళీ గలా గలా నవ్వింది వాణి .

 

నేను అమాయకుణ్ణా ! అమాయకురాలైన పద్మ నోట్లోంచీ ఈ మాటా !!

 

ఆ క్షణంలోనే నాకొక జీవితపాఠం అర్ధం అయ్యింది .

 

'ప్రపంచంలోనే అమాయకులంటూ ఎవ్వరూ ఉండరని ,ఆ మాటే ఫాల్తూ మాట అని .'

 

అప్పటినుండీ ,ఇప్పటి వరకూ నాకు అమాయకులెవ్వరూ కనిపించలేదండీ !

 

మీకెవరన్నా కనిపించారా ?
Cerebral palsy వచ్చిన వాళ్ళు కాకుండా ...

 

...

 

46 సంవత్సరాల తర్వాత ...

 

ఇప్పుడు నేను ,రాజూ ,వాణీ మా classmates WhatsApp గ్రూపులో active గా ఉన్నాం.

 

రవీ ,శివాజీలు మాకందనంత దూరం వెళ్ళి పోయారు .

 

పద్మ ఎక్కడుందో తెలియదు . ఎవరికన్నా తెలిస్తే తెలియజేయండి .

 

-డి ఆర్ కె
09-09-2020