సర్, సంస్కారం అంటే ఏమిటి....           (08-Sep-2020)


 గుర్తుకొస్తున్నాయి ...37

 

ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు కీర్తి శేషులు శ్రీ చండ్ర రాజేశ్వరరావు గారిని ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న వేశారు .

 

“సర్, సంస్కారం అంటే ఏమిటి?”

 

వారి సమాధానం :

 

మన మనసులో వచ్చిన ఆలోచనలన్నింటినీ మనం నోటితో మాట్లాడం. వాటిని సెన్సార్ చేసి కొన్ని మాత్రమే మాట్లాడతాం.

 

పది మందితో నోటితో మాట్లాడే మాటలన్నింటినీ కూడా కాగితం మీద పెట్టం.

 

మరింత జాగ్రత్తగా మంచి పదాలను వాడుతూ అవసరమైన మాటలను మాత్రమే రాస్తాం.

 

మనసులో నుంచి వచ్చే మాటలన్నీ మాట్లాడకుండా ఉండడం, మాట్లాడిన ప్రతి మాటని కాగితం మీద పెట్టకుండా ఉండడం - ఈ రకమైన సెన్సారింగే ‘సంస్కారం అంటే’.

 

వారు చెప్పినవి సరిగ్గా ఇవే మాటలు కాకపోవచ్చు కానీ అర్ధం మాత్రమే ఇదే.

 

నాకు ఈ నిర్వచనం ఎంతో బాగా నచ్చింది.

 

గుత్తికొండ కల్యాణ్ గారి నేటి పోస్ట్ చదివిన తరువాత ఈ విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది.

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు
08.09.2020