పర్యాటకులారా ఇటు రావద్దు! August 14, 2018....           (14-Jul-2020)


కొత్త ప్రదేశాలను చూడటం, అందుకోసం ప్రయాణాలు చెయ్యడం మనసుకు ఆహ్లాదం కలిగించే విషయమే. కానీ ఊటీ, కొడైకెనాల్ వంటి ఎన్నో అందమైన ప్రదేశాలు పర్యాటకులు వదిలేసిన చెత్త వల్ల మురికికూపాలుగా మారిపోవడం చూస్తున్నాం. ముఖ్యంగా ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు – మంచినీళ్ళ సీసాలు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, టీ కప్పులు, పెరుగు కప్పులు, ఐస్క్రీమ్ కప్పులు, కుర్ కురే, లేస్, బింగో ప్యాకెట్ల కవర్లు వంటి చెత్తతో రోడ్ల ప్రక్కన, ఖాళీ స్థలాలు అసహ్యంగా తయారవుతున్నాయి.

 

ఇవి కాక అతి పర్యాటకం వలన వచ్చే అనేక ఇతర సమస్యలు కూడా పర్యాటక రంగంలో ఉన్నాయి.

పర్యావరణహితంగా, స్థానికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్లుగా పర్యాటకరంగానికి తగిన మార్గదర్శకాలు రూపొందించి అమలుచెయ్యాలి. ఇటీవల ఈ విషయంపై ఈనాడు దినపత్రిక లో వచ్చిన ఈ వార్త చదవండి. మీ సలహాలు కూడా రాయగలరు.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు