సోమరిపోతుల సినిమాకు ఇంత మంచి పేరు ఎలా వచ్చింది? April 14, 2018....           (14-Jul-2020)


‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చూసిన తరువాత నాకు కలిగిన భావాలు….

 

సోమరిపోతుల సినిమాకు ఇంత మంచి పేరు ఎలా వచ్చింది?

 

ఒక్క ఫైటు కూడా లేకుండా అనుబంధాలకు పెద్ద పీట వేస్తూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని తీశామని చెప్పుకుంటున్నారు. 

 

ఇందులో కథానాయకులు ఇద్దరూ గానీ, వారి తండ్రి గానీ ఒక్క పనీ చేయరు. పైగా ఆ తండ్రి తన తండ్రి సంపాదించినదంతా తింటూ తిరుగుతూ ఉంటాడు. సీతమ్మను కూడా చదివించినట్లు మనకు ఎక్కడా కనపడదు. ఆ ఇంట్లోని ఆడవాళ్ళందరూ సోమరిపోతులైన ఈ ముగ్గురు మగవాళ్ళకూ వండిపెట్టడమే పని. ఉద్యోగం చేసుకోమని వీరిచ్చే సలహా ఈ మగ మహారాజులకు పట్టదు.

 

ప్రతినాయకుడైన ‘రావు రమేష్’ చెప్పే మాటలే ఆచరణాత్మకంగా అనిపిస్తాయి.

 

నిజంగా చెట్టంత ఎదిగిన ఇలాంటి కొడుకులు ఏ పనీ చేయకుండా ఉంటే ఏ తల్లీ, తండ్రైనా భరించగలరా?మరి ఈ అప్రయోజకుల సినిమా ఎందుకు ఆడుతున్నట్లు?

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.