ఉచితంగా ఇవ్వకండి – మమ్మల్ని బిచ్చగాళ్ళను చేయకండి April 13, 2018....           (14-Jul-2020)


 2014 ఎన్నికల ముందు ఓటర్లకు చేసిన విజ్ఞప్తి….

 

ఉచితంగా ఇవ్వకండి – మమ్మల్ని బిచ్చగాళ్ళను చేయకండి

 

రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి పార్టీ హామీలను గుప్పిస్తున్నాయి. ముఖ్యమైన పార్టీలన్నీ ఉచిత పధకాలు చాలా ప్రతిపాదించాయి. ఆచరణలో సాధ్యాసాధ్యాలను విస్మరించి ఓట్ల కోసం ఇటువంటి ఎరలను వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అనధికారికంగా డబ్బు, చీరలు, మద్యం ఇచ్చి ఓట్లు కొనడం ద్వారా, అధికారికంగా ఈ ఉచిత పధకాల ద్వారా జనాన్ని కూడా లంచగొండులు గానూ, బిచ్చగాళ్ళగానూ చేస్తున్నారు.

 

ఇలా వస్తువులు, డబ్బు ఇచ్చి అధికారంలోకి వచ్చి సహజ వనరులను దోచుకొని కుబేరులు కావడమే నేటి పాలకుల పని.

 

ప్రతి వస్తువు మానవ శ్రమ ద్వారానే తయారౌతుంది. శ్రమ లేకుండా ఏ పనీ జరగదు. యువతకు సరైన ఉద్యోగాలను చూపండి. కష్టానికి సరైన ఫలితం ఇవ్వండి. ఉచితంగా తీసుకొని మా గౌరవం పోగొట్టుకోము. కనుక ఉచిత పధకాలు ఏమీ వద్దు.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.