మెడికల్ సీట్లు వృధా చేయకండి....           (30-Jun-2020)


10 జూలై 2012 వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైనది.

 

 

మెడికల్ సీట్లు వృధా చేయకండి

 

 

మెడికల్ ఎంసెట్ లో ర్యాంకులు సాధించిన కొందరు I.A.S.అవ్వడం తమ ధ్యేయం అని చెప్పారు. ఈవార్త చదివిన నాలాంటి చాలామంది డాక్టర్లం విభ్రాంతికి గురి అయ్యాము.

 

 

డాక్టరు అవ్వాలనే కోరిక బలీయంగా ఉన్నాగానీ, సీటు రాక చాలామంది నిరాశ పడుతున్నారు. ఉన్న 4 వేల మెడికల్ సీట్లు మన రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం సరిపోవడం లేదు.

 

 

మరి వాటిలో కొన్ని ఇలా వృధా అయిపోతుండడం బాధగా ఉంది. I.A.S.కు వెళ్ళాలన్న ఖచ్చితమైన నిర్ణయానికి ముందే వస్తే M.B.B.S. చేయడం ఎందుకు? ఏ డిగ్రీ అయినా సరిపోతుంది కదా!

 

 

కనుక వేరే వృత్తులలో ఉద్యోగాలలో స్థిరపడాలనుకున్న విద్యార్థులు దయచేసి M.B.B.S. సీట్లు వృధా చేయవద్దని మనవి.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి హాస్పిటల్

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్