ప్రభుత్వ టీచర్లకు విజ్ఞప్తి....           (29-Jun-2020)


ప్రభుత్వ టీచర్లకు విజ్ఞప్తి

 

 

గత 3 – 4 వారాలుగా రాష్ట్రమంతటా విద్యా సంబరాలు జరుగుతున్నాయి.

 

 

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లోనికి పిల్లలను చేర్చడానికి మండల విద్యాధికారి ఆధ్వర్యంలో టీచర్లు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ బడులలోనే ఎందుకు చేరాలో వివరంగా ఓపికగా చెబుతున్నారు. చాలాచోట్ల ఈ ప్రచారం మెరుగైన ఫలితాలనే ఇస్తోంది.

 

 

అయితే టీచర్లు తమ పిల్లల్ని ఏ స్కూలులో చేర్చుతున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళలో చదివిస్తూ ఊళ్ళో పిల్లల్ని ప్రభుత్వ స్చూల్లకు పంపమని అడిగితే ఉపయోగం ఉండదు కదా! మన ఆచరణను మాత్రమె ప్రజలు విశ్వసిస్తారు కనుక ప్రభుత్వ టీచర్లంతా తమ పిల్లల్ని వారు పని చేసే స్కూళ్ళలలోనే జేర్చమని మనవి.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్

 

 

10-06-2014 వ తేదీన ‘ప్రజాశక్తి’ దినపత్రికలో ‘టీచర్లు మార్గదర్శకులు కావాలి’ పేరుతో ప్రచురించబడినది.