2006*వ రోజు...
ఈ నాటి శుభోదయ వేళ – వేకువనే 4.00 నుండి 6.15 వరకు విస్తరించిన స్వచ్చంద కార్యకర్తల శ్రమదానం లో 32 మంది పాత్ర ఉంది. గంగులవారిపాలెం దారిలోనే – ప్రధానంగా సన్ ఫ్లవర్ దారి నుండి వీరబాబు నివాసం దాకా, ఆ పైన మురుగు కాల్వ మలుపు దాకా నెలకొన్న శ్రమదాన సందడిలోనే 22 మంది కనిపించారు. వీరు కాక స్వచ్చ సుందర కళాకారుల బృందం బందరు జాతీయ రహదారికి ఉత్తర దిశలోని వైజయంతం (ఇంద్రుని రాచనగరు అని అర్ధం) పేరును సార్ధకం చేస్తూ – తమ సృజన దీప్తిలో మరిన్ని మెరుగులు దిద్దారు. అంతటి నిడివీ,...
READMORE
2005*వ రోజు...
నేటి ప్రాతః సమయ గ్రామ మెరుగుదల ప్రయత్నంలో కూడి వచ్చిన కార్యకర్తలు 28 మంది. శ్రమదాన ప్రాంతాలు – 1) గంగులవారిపాలెం దారి 2) బందరు రహదారి ప్రక్క జమీందారుల ‘వైజయంతం’.
...
READMORE
2004*వ రోజు...
కొద్దిపాటి మార్పులతో 29 మంది కార్యకర్తలు గ్రామం లోని మూడు చోట్ల – మూడు విధాల ప్రయోజనకరమైన శ్రమదానం చేశారు. 4.05 – 6.05 సమయాల మధ్య ఈ బాధ్యతా నిర్వహణం జరిగింది. ఎన్ని వేల దినాల, ఎన్ని లక్షల పని గంటల పాటైనా – స్వచ్చ సైనికుల స్వగ్రామ మెరుగుదల దీక్ష మాత్రం మారలేదు – చల్లపల్లి కి అందవిహీనత బెడద, క...
READMORE
2003*వ రోజు...
ఈ నాటి వేకువ 4.00 - 6.05 సమయాల మధ్య యధావిదిగా – నిరాటంకంగా జరిగిన గ్రామ బాధ్యతా నిర్వహణంలో భాగస్వాములు 29 మంది. శ్రమాదాన లబ్ది చల్లపల్లిలోని రెండు – మూడు ప్రాంతాలకు - గంగులవారిపాలెం బాటలో, బందరు రహదారిలో, మొక్కలకు నీరందవలసిన మరికొన్ని వీధులలో!
...
READMORE
2002*వ రోజు...
ఈ నాటి వేకువ సమయంలో 4.10 నిముషాల నుండి 6.10 దాక వర్ధిల్లిన స్వచ్చ కార్యకర్తల శ్రమదాన సందేశంలో 29 మంది పాల్గొన్నారు. ప్రదేశం – ఎంత చేస్తున్నా తరగని చెత్తా – చెదారం నిండిన గంగులవారిపాలెం మార్గంతో పాటు, బందరు రహదారిలోని అమరావతి జమిందారుల “వైజయంతం”.
...
READMORE