శబ్ద కాలుష్యాన్ని అరికడుతున్న NTR జిల్లా ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగానికి అభినందనలు.....           (26-Jul-2024)


 శబ్ద కాలుష్యాన్ని అరికడుతున్న NTR జిల్లా ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగానికి అభినందనలు.

            కొన్ని వేడుకల సందర్భంగా DJ ల పేరుతో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులను వాహనాలకు కట్టి బజార్లలో ప్రమాదకరమైన శబ్దంతో సంగీతం మోగించడం ఇటీవల కాలంలో వస్తున్న కొత్త ఒరవడి. ఇది మన సున్నితమైన చెవి ఎముకలకు, నరాలకు ప్రమాదంగా మారి చెవుడు వచ్చే అవకాశం ఉంది. అనుమతింపబడిన Decibels కంటే ఈ శబ్దం చాలా ఎక్కువ.

కనుక అధికారులు ఈ DJ లను బ్యాన్ చేయవలసిందిగా అనేక మంది కోరుకుంటున్నారు.