కౌన్సిలింగ్ అంటే........           (14-Jul-2020)


 పై బిల్డింగ్ లోనే మేము చల్లపల్లి లో 1988 లో హాస్పిటల్ మొదలుపెట్టాము.

 
హాస్పిటల్ ముందు ఇప్పుడు సిమెంట్ రోడ్డు కనిపిస్తున్నా అప్పుడు పెద్ద పెద్ద గోతులతో ఘోరంగా ఉండేది.
 
చిట్టి మావయ్య గారు ఒక రోజు మమ్మల్న్ని చూడడానికి వచ్చారు.
‘ఈ రోడ్డు ఇలా ఉందేమిటి’ అని అడిగారు.
‘అవును మావయ్య గారూ ఎవరూ పట్టించుకోవడం లేదు’ అన్నాను.
‘నీ ఇంటి ముందు రోడ్డు నువ్వే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు?’ అన్నారు.
ఈ వాక్యం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది.
ఇప్పుడు నేను మా హాస్పిటల్ రోడ్ నే కాదు, ఊరంతా బాగుచేయాలని సంకల్పించడానికి నాకు ఆ రోజు మా చిట్టి మావయ్య గారు ఇచ్చిన కౌన్సిలింగ్ కూడా ఒక ముఖ్య కారణం. చిట్టి మావయ్య గారికి చల్లపల్లి ఋణపడి ఉంటుంది.
మొన్న ఉదయం ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం ఆప్రాంతంలోనే జరిగింది. ఈ విషయాన్ని మా సహకార కార్యకర్తలందరికీ చెప్పడం జరిగింది.
 
బాబ్జీ,
చల్లపల్లి,
10.02.2020.